![]() |

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్.. టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్.. ది మోస్ట్ ఇన్నోవేటివ్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డికే.. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో సినిమా వస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రచ్చ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సన్సేషనల్ కాంబోలో ప్రాజెక్ట్ లాక్ అయినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు ఇండియన్ సినిమా హిస్టరీలో ఎన్నో పాన్-ఇండియా కలయికలు చూశాం. కానీ, ఈ ప్రాజెక్ట్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే, ఒకవైపు బాలీవుడ్‌ని దశాబ్దాలుగా ఏలుతున్న మాస్ ఐకాన్ సల్మాన్ ఖాన్. ఇంకోవైపు 'ది ఫ్యామిలీ మేన్', 'ఫార్జీ' లాంటి గ్లోబల్ వెబ్ సిరీస్‌లతో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసిన దర్శకులు రాజ్ అండ్ డికే. ఇక వీరికి తోడుగా వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్. ఈ కాంబో న్యూస్ రావడమే ఆలస్యం.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ మొదలైపోయింది.
ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతోందని సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను రంగంలోకి దించుతున్నారని తెలుస్తోంది.
![]() |